దేవదాస్ కనకాల అంత్యక్రియలు పూర్తి…!

దేవదాస్ కనకాల అంత్యక్రియలు పూర్తి…!

Published on Aug 3, 2019 4:07 PM IST

Devdas

ప్రముఖ నటుడు, దర్శకుడు, నట గురువు. దేవదాస్‌ కనకాల నిన్న తుది శ్వాసవిడిచిన విషయం విదితమే.కాగా నేడు మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి కుమారుడు రాజీవ్‌ కనకాల అంత్యక్రియలు నిర్వహించారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవదాస్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. వీరికి రాజీవ్‌ కనకాల, శ్రీలక్ష్మి కనకాల సంతానం. వారిద్దరూ కూడా నటులే. కోడలు సుమ యాంకర్‌గా కొనసాగుతున్నారు.

అంతకు మందు మణికొండలోని దేవదాస్‌ కనకాల ఇంటికి చేరుకున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయనతోపాటు సినీనటులు బ్రహ్మాజీ, హేమ, సమీర్‌,రాజేంద్ర ప్రసాద్ తదితరులు దేవదాస్‌ కనకాలకు నివాళలర్పించారు. ఆయన కుటుంబం సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు