విడుదలైన ‘ఒక లైలా కోసం’ మూవీ ఫస్ట్ లుక్..!

okalila-kosam
నాగ చైతన్య, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా ‘ఒక లైలా కోసం’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలైంది. కలర్ ఫుల్ గా డిజైన్ చేసిన ఈ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాగ చైతన్య చాలా స్టైలిష్ లుక్ లో తన అర్మ్స్ చూపిస్తూ బెంచ్ పై కూర్చున్నాడు. పూజ హెడ్గే అందంగా ఉంది.

ప్రస్తుతం ‘ఒక లైలా కోసం’ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. త్వరలో ఆడియో రిలీజ్ డేట్ తదితర వివరాలను వెల్లడించనున్నారు.

Exit mobile version