లేటెస్ట్ : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అవైటెడ్ “నా సామిరంగ”

లేటెస్ట్ : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అవైటెడ్ “నా సామిరంగ”

Published on Feb 17, 2024 7:05 AM IST


టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హిట్ “నా సామిరంగ” కోసం అందరికీ తెల్సిందే. మరి సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం నాగ్ కెరీర్ లో మరో సంక్రాంతి హిట్ గా నిలిచింది. అయితే సంక్రాంతికి వచ్చిన చిత్రాల్లో దాదాపుగా అన్ని సినిమాలు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కో వచ్చేసాయి.

ఫైనల్ గా ఇప్పుడు నా సామిరంగ కూడా వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు డిస్నీ + హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చేసింది. మరి ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని చూసి ఎంజాయ్ చేయాలి అనుకునే వారు హాట్ స్టార్ లో వీక్షించవచ్చు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా , రుక్షర్ ధిలాన్ తదితరులు నటించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు