లేటెస్ట్ : ధనుష్, శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ నుండి రేపు బిగ్ అప్ డేట్

లేటెస్ట్ : ధనుష్, శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ నుండి రేపు బిగ్ అప్ డేట్

Published on Jan 17, 2024 9:09 PM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తాజాగా ఒక భారీ పాన్ ఇండియన్ మూవీ రూపొందనుందనేది తెల్సిందే. దీనిని ప్రముఖ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుండగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇందులో ఒక కీలక పాత్ర చేయనున్నారు.

మొదటి నుండి అందరిలో ఎంతో మంచి క్యూరియాసిటీ ఏర్పరిచిన ఈ ప్రాజక్ట్ కి సంబంధించి రేపు ఒక బిగ్ అప్ డేట్ ని అందించనున్నట్లు మేకర్స్ తాజాగా ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. హీరో ధనుష్ నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించనున్న ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ కానుంది. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించనున్న ఈమూవీ యొక్క ఆ బిగ్ అప్ డేట్ ఏమిటనేది తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు