‘అసురన్’ రీమేక్ టైటిల్ అదేనా ?

‘అసురన్’ రీమేక్ టైటిల్ అదేనా ?

Published on Jan 21, 2020 11:09 AM IST

తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘అసురన్’ను తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనంతపురంలో జరుగుతోంది. నెల రోజుల పాటు అక్కడే షూటింగ్. అయితే సినిమా టైటిల్ కానీ వెంకీ లుక్ కానీ బయటకు విడుదల చేయలేదు టీమ్.

తాజా సమాచారం మేరకు ఈ చిత్రానికి ‘నారప్ప’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సురేష్ ప్రొడక్షన్స్ ఇదే టైటిల్ క్కన్ఫర్మ్ చేస్తారా లేకపోతే వేరే ఏదైనా కొత్త టైటిల్ పెడతారేమో చూడాలి. ఇక నటీనటుల విషయానికొస్తే ఇందులో ప్రియమణి కథానాయికగా నటించనుంది. చిత్రాన్ని 2020 మొదటి సగంలోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు సురేష్ బాబు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు