ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ దర్శకుడు అట్లీతో రాకా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా తర్వాత బన్నీ మళ్లీ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేయనున్నాడు. అయితే ఈ సినిమాపై కూడా మంచి హైప్ నెలకొంది. కానీ లేటెస్ట్ గా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక కాప్ రోల్ లో అంటే పోలీస్ గా కనిపిస్తాడని పలు రూమర్స్ మొదలయ్యాయి. గతంలో అల్లు అర్జున్ చిన్న కామియో రేస్ గుర్రం లో చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఈ కొత్త రూమర్స్ విషయంలో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అన్నట్టే తెలుస్తోంది. అయితే టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో చాలా కాలం తర్వాత పోలీస్ రోల్ లో కనిపించనున్నారట. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
