‘అల వైకుంఠపురంలో’రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Published on Sep 22, 2019 3:11 pm IST

వచ్చే యేడాది సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. వాటిలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ‘అల వైకుంఠపురంలో’ కూడా ఉంది. ఈ సినిమాను జనవరి 12న ప్రేక్షకులకి అందివ్వాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయమే సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే ఈ విషయమై చిత్ర నిర్మాణ సంస్థల నుండి ఇంకా ఆఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలను నవంబర్లో విడుదల చేయనున్నారు. ఇందులో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. గతంలో బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రాలు మంచి హిట్లుగా నిలవడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో టబు, సుశాంత్, జయరామ్, నివేత పేతురాజ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More