ప్రస్తుతం టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల స్వా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. పర్టిక్యులర్ ఈ చిత్రంపై మ్యూజికల్ ఫాన్స్ మరియు మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. చిరు మరియు మణిశర్మ కాంబోలో చాలా ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో రిపీట్ కావడంతో సంగీత ప్రియులు ఎనలేని అంచనాలు పెట్టుకున్నారు.
ఇంకా అలాగే ఈ చిత్రంలో మెగాఫోవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక భాగం కానున్నందున్న మెగా ఫ్యాన్స్ లో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే మరి ఇలాంటి భారీ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ వచ్చే ఏడాది వేసవికి విడుదల చేసేయాలని ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మిగిలి ఉన్న షూట్ మరియు విడుదల పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.
వచ్చే జనవరిలో చరణ్ ఈ చిత్రం షూట్ లో పాల్గొననుండగా మేకర్స్ ఈ చిత్రాన్ని మార్చ్ నెలకల్లా పూర్తి చేసేయ్య్లని భావితస్థున్నారట. అంతే కాకుండా ఈ చిత్రాన్ని కొరటాల మే నెలలో రెండవ వారం లోపు విడుదల చేసేయాలని యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో అప్పటికి మేకర్స్ ఈ సినిమాను ఫిక్స్ చేసుకున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
