“దేవర” షూట్ పై లేటెస్ట్ బజ్.!

“దేవర” షూట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Feb 13, 2024 7:03 AM IST

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ చిత్రం రిలీజ్ పట్ల కూడా అంతా ఆసక్తి నెలకొనగా ఇప్పుడు షూటింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పటికి దాదాపు కంప్లీట్ కాగా రీసెంట్ గా మాత్రం కొంచెం గ్యాప్ తీసుకున్నారు మేకర్స్.

ఇక ఈ గ్యాప్ తర్వాత అయితే ఈ మార్చ్ 14 నుంచి మేకర్స్ కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో కొంతమేర టాకీ పార్ట్ ని సహా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను కూడా తెరకెక్కించనున్నారట. ఇక సాంగ్స్ షూట్ మాత్రం బ్యాలన్స్ ఉందట. మరి చూడాలి దేవర ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేది. ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు