‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్

‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్

Published on Feb 17, 2024 1:06 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. లేటెస్ట్ షెడ్యూల్ కి రెడీ అయిన ఈ మూవీని వీలైనంత త్వరలో ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తుండగా దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు.

శ్రీకాంత్, అంజలి, ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న గేమ్ ఛేంజర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని, ఈ మేరకు గట్టిగా ఆలోచన చేస్తున్న మేకర్స్ త్వరలో అధికారికంగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారట. మరోవైపు ఈ మూవీ రిలీజ్ కోసం చరణ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ కూడా ఎప్పటి నుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు