“గుంటూరు కారం” సెకండ్ సింగిల్ పై లేటెస్ట్ బజ్.!

“గుంటూరు కారం” సెకండ్ సింగిల్ పై లేటెస్ట్ బజ్.!

Published on Nov 29, 2023 4:30 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా మాటల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “గుంటూరు కారం”. మరి ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే ఓ సూపర్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుండగా ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సింగిల్ దం మసాలా మంచి హిట్ గా నిలవగా ఇక నెక్స్ట్ సాంగ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సాంగ్ రిలీజ్ పై లేటెస్ట్ బజ్ తెలుస్తోంది. దీనితో రెండో సాంగ్ ఈ డిసెంబర్ 10 లోపు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్. ఈ లోపు సాంగ్ షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని డిసెంబర్ 10 కి లేదా ఆ లోపే సాంగ్ పై క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతికి రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు