“హను మాన్” ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ బజ్

“హను మాన్” ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ బజ్

Published on Feb 25, 2024 8:03 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “హను మాన్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం విడుదల అయ్యాక థియేటర్స్ లో సెన్సేషనల్ వసూళ్లు అందుకోగా ఇప్పుడు ఫైనల్ రన్ కి చేరుకుంటుంది. ఇక ఈ తర్వాత అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఓటిటి రిలీజ్ కోసమే అని చెప్పాలి. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ జీ 5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే గత కొన్ని రోజులు రిలీజ్ పై బజ్ వినిపిస్తుండగా ఇప్పుడు మరో బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం హను మాన్ కేవలం కొన్ని భాషల్లోనే కాకుండా ఏకకాలంలో పాన్ ఇండియా భాషల్లో అయితే జీ 5 లో అందుబాటులో ఉంటుంది అని టాక్. అలాగే ఈ మార్చ్ 2 నుంచే వస్తుంది అని కూడా స్ట్రాంగ్ బజ్ ఉంది. మరి దీనిపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి గౌర హరీష్ సంగీతం అందించగా నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు