చిరు “గాడ్ ఫాథర్” కాంబినేషన్ పై లేటెస్ట్ బజ్

చిరు “గాడ్ ఫాథర్” కాంబినేషన్ పై లేటెస్ట్ బజ్

Published on May 29, 2024 2:02 AM IST


మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “విశ్వంభర” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత చిరు మరోసారి కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా తో గాడ్ ఫాథర్ తర్వాత వర్క్ చేయనున్న సంగతి తెలిసిందే. మరి ఈ కాంబినేషన్ పట్ల కూడా అందరిలో మంచి ఆసక్తి నెలకొనగా ఈ చిత్రంపై ఇపుడు మరింత సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా స్క్రిప్ట్ సిట్టింగ్స్ జరుగుతున్నాయట.

దర్శకుడు మోహన్ రాజా అండ్ టీం స్క్రిప్ట్ పనులు కర్ణాటకలో చేస్తున్నారట. స్క్రిప్ట్ లాక్ అయ్యి మెగాస్టార్ విశ్వంభర పూర్తి అయ్యిన వెంటనే ఈ సినిమాని ఎలాంటి ఆలస్యం లేకుండా మొదలు పెట్టేస్తారట. మొత్తానికి అయితే మెగాస్టార్ 157 పనులు కూడా ఫుల్ స్వింగ్ లో పూర్తయ్యి పోతున్నాయి అని చెప్పాలి. ఇక విశ్వంభర చిత్రానికి దర్శకుడు వశిష్ట వర్క్ చేస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు