మెగాస్టార్ సినిమాకు హీరోయిన్ లేనట్టేనా.?

Published on Nov 25, 2020 5:30 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. మిగిలి ఉన్న షూట్ ను పూర్తి చేసుకొనే పనిలో ఉన్న ఈ చిత్రం లైన్ ల ఉండగానే చిరు మరో రెండు సినిమాలను ఓకే చేసినట్టు తెలిసిందే.

అయితే ఈ రెండు కూడా రీమేక్ సినిమాలు కావడం వాటికి దర్శకులు ఎవరో ఫైనలజ్ వంటివి చకచకా జరిగిపోయాయి. అయితే చిరు టేకప్ చేసిన “లూసిఫర్” రీమేక్ విషయంలో మాత్రం ఏదొక ట్విస్ట్ చోటు చేసుకుంటూనే ఉంటుంది. అలా మొదట యంగ్ డైరెక్టర్ నుంచి వినాయక్ కు సినిమా మారింది.

కానీ ఆ తర్వాత వినాయక్ ఈ చిత్రంలో ఓ హీరోయిన్ ను కూడా పెడతారని టాక్ వచ్చింది. కానీ ఈ చిత్రానికి మళ్ళీ దర్శకుడు మారాడు అన్న టాక్ కూడా ఈలోపునే వచ్చేసింది. కానీ ఇప్పుడు మరో టాక్ ప్రకారం ఈ చిత్రంలో మేకర్స్ ఎలాంటి హీరోయిన్ ను పెట్టడం లేదని తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More