నాని “ది ప్యారడైజ్” పై లేటెస్ట్ బజ్!

నాని “ది ప్యారడైజ్” పై లేటెస్ట్ బజ్!

Published on Jul 23, 2026 7:06 AM IST

ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు అవైటెడ్ భారీ సినిమాల్లో నాచురల్ స్టార్ నాని నటించిన సినిమా ది ప్యారడైజ్ కూడా ఒకటి. తన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఏర్పరచిన ఈ కొత్త ప్రపంచం చూసేందుకు పాన్ ఇండియా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా ఆలస్యం అవుతూ వస్తుండడంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశ గానే ఉన్నారు.

అయితే ఇందుకు కారణం సినిమా షూట్ ఇంకా పూర్తి కాకపోవడమే.. ఇక లేటెస్ట్ గా సినిమా షూట్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం మేకర్స్ సినిమా తాలూకా భారీ క్లైమాక్స్ లోనే బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దీని తర్వాత మరికొన్ని రోజుల్లో సినిమా అవైటెడ్ ఐటమ్ సాంగ్ షూట్ ని మొదలు పెట్టనున్నారు అని తెలుస్తోంది. సో ఇవన్నీ అయ్యాక రిలీజ్ పై ఓ క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు