నయనతార పెళ్లికి సిద్దమైందా ?

నయనతార పెళ్లికి సిద్దమైందా ?

Published on Sep 26, 2019 3:05 PM IST

లేడీ సూపర్ స్టార్ నయనతార వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో నయన్ ప్రేమలో ఉంది. వీరి ప్రేమాయణం చాలా ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఇద్దరూ తరచు తమ రిలేషన్ ఎలివేట్ అయ్యేలా హాలీడే ట్రిప్పులకు, పార్టీలకు వెళుతుంటారు. తాజాగా ప్రియుడి పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్ చేసింది నయన్.

అయితే వీరి వ్యక్తిగత బంధానికి శుభం కార్డ్ పడే సమయం ఆసన్నమైందనే వార్తలు కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ జోడీ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారట. పెళ్లికి నయన్ తొందరపడకపోయినా విఘ్నేష్ శివన్ ఇంట్లో మాత్రం తొందరపెడుతున్నారట. అందుకే నయన్ పెళ్లికి రెడీ అవుతోందని, డిసెంబర్లో వీరి వివాహం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే నయన్ లేదా విఘ్నేష్ ఎవరో ఒకరు స్పందించే వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు