ప్రభాస్ ఫ్యాన్స్ కి తీపి కబురు ఎప్పుడో?

Published on Jun 3, 2020 3:00 am IST


ప్రస్తుతం ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా నుంచి ఒక అధికారిక అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంత గంలో ఎదురు చూస్తున్నారు.

ముఖ్యంగా అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం మరింత స్థాయిలో ఎదురు చూస్తున్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ చుట్టూతా పెద్ద మిస్టరీయే నడుస్తుంది. అయితే ఈ పోస్టర్ తీపి కబురు త్వరలోనే రాబోతుంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఫస్ట్ లుక్ పోస్టర్ దాదాపు ఈ జూన్ నెల మూడవ వారంలోనే వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే చాలా సార్లు అనేక తేదీలు సమయాలపై ఆశలు పెట్టుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఈ జూన్ మూడో వారం కోసం కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More