RC 17: చరణ్, సుకుమార్ బిగ్ ప్రాజెక్ట్ రిలీజ్ ప్లాన్స్? ఇంత త్వరగానా?

rc17

ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రానున్న క్రేజీ కాంబినేషన్ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ల కలయికలో చేయనున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. రామ్ చరణ్ కెరీర్ 17వ సినిమా ప్లాన్ చేసిన ఈ సినిమా కోసం గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి లాంటి వారే ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురు చూడడం విశేషం.

సో ఆ రేంజ్ హైప్ ఉన్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ తాలూకా రిలీజ్ కి సంబంధించిన రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం సుకుమార్ ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగానే ఫినిష్ చేసేసి వచ్చే ఏడాది ముగింపుకే థియేటర్స్ లో నిలపాలి అనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

సో ఈ ఏడాదిన్నర కాలంలోనే ఈ మ్యాడ్ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఆల్రెడీ మన హీరోలు దర్శకులు మీద ఆడియెన్స్ కంప్లైంట్స్ ఉన్నాయి. అలాంటి హాలీవుడ్ సినిమాలే తక్కువ సమయాల్లో చేసేస్తుంటే మనమెందుకు ఇంత సమయం తీసుకుంటున్నాం అనే మాట ఇప్పుడు ప్రేక్షకుల్లో పెరుగుతుంది. సో ఇలాంటి మాసివ్ కాంబినేషన్ లలో సినిమాలు త్వరగా వస్తే ఆడియెన్స్ తో పాటుగా బాక్సాఫీస్ కూడా ఎప్పటికప్పుడు కళకళలాడుతుంది.

Exit mobile version