‘శ్రీనివాస కళ్యాణం’ విడుదల తేదీ అదేనా ?
Published on May 17, 2018 4:46 pm IST

చివరగా చేసిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రం ఆశించినంత స్థాయిలో విజయాన్ని అందివ్వకపోవడంతో ప్రస్తుతం చేస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ మీదనే ఆశలు పెట్టుకున్నాడు హీరో నితిన్. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే చండీఘర్ షెడ్యూల్ పూర్తిచేసిన టీమ్ త్వరలో హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనుంది.

జూలైలో చివర్లో విడుదలకావల్సిన ఈ సినిమా ఆగష్టుకి వాయిదాపడిన నేపథ్యంలో ఆగష్టు 9ని విడుదల తేదీగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే వార్తపై నిర్మాత దిల్ రాజు సంస్థ నుండి ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా కథానాయకిగా నటిస్తోంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook