సూర్య “కంగువ” రిలీజ్ పై లేటెస్ట్ బజ్.!

సూర్య “కంగువ” రిలీజ్ పై లేటెస్ట్ బజ్.!

Published on May 19, 2024 10:00 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సై ఫై యాక్షన్ డ్రామా “కంగువ” కోసం తెలిసిందే. మరి ఈ భారీ చిత్రం విడుదల కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది.

అయితే ఈ ఏడాదిలోనే రిలీజ్ ని మేకర్స్ ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు రిలీజ్ పై సాలిడ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ భారీ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాది దీపావళి రేస్ లో నిలిపే విధంగా ప్లాన్ చేస్తున్నారట. దీనితో ఈ చిత్రం అక్టోబర్ ఎండింగ్ లో కానీ నవంబర్ 1 కి గాని రావచ్చని చెప్పాలి.

ఇక ఈ భారీ చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తుండగా సూర్య డ్యూయల్ షేడ్స్ లో కనిపించనున్నాడు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా గ్రీన్ స్టూడియోస్, యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 10 భాషల్లో 3డి లో కూడా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు