తారక్ – త్రివిక్రమ్ ల సినిమాపై లేటెస్ట్ బజ్.!

Published on Mar 19, 2021 12:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ మాస్ లోనే అసలు ఉహించని కోణాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తారక్ తో “అరవింద సమేత వీర రాఘవ”లో చూపించారు. దీనితో ఆ టైం లో ఈ కాంబో నుంచి ఈ రేంజ్ మాస్ ఫీస్ట్ ను ఊహించకపోయే సరికి వారి కాంబో అంటే భారీ అంచనాలే సెట్టయ్యాయి. దీనితో పాటుగా ఆ చిత్రం తర్వాత మరొకటి ఎప్పుడు ఉంటుందా అని ఆలోచనలో ఉన్న కొద్ది లోనే ఇంకో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసేసారు.

మరి ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఈ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ బజ్ కొంత వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని మేకర్స్ రాబోయే కొన్ని రోజుల్లోనే ముహూర్తంతో మొదలు పెట్టనుండడమే కాకుండా త్రివిక్రమ్ ఒక సాలిడ్ స్క్రిప్ట్ ను ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే వచ్చే ఏడాది వేసవి రేస్ లోనే ఈ చిత్రం విడుదల ఉంటుంది అని ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. మరి ఇవి ఎంత వరకు నిజమవుతాయో కాలమే నిర్ణయించాలి. ఈ చిత్రాన్ని కూడా హారికా హాసిని వారే నిర్మాణం వహిస్తుండగా “అయినను పోయి రావలె హస్తినకు” అనే టైటిల్ ఖరారు అయ్యిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :