విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందంటే..

విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందంటే..

Published on Sep 22, 2020 2:14 AM IST


సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం ‘ఫైటర్’. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ వలన ఆగిన ఈ చిత్ర షూటింగ్ త్వరలో హైదరాబాద్లో రీస్టార్ట్ కానుంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో డైరెక్టర్ పూరి వీలైనంత త్వరగా సినిమాను కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. చెప్పిన సమయానికి ప్రాజెక్ట్ ఫినిష్ చేయడం పూరి స్టైల్. అందుకే ఆయన మీద నమ్మకంతో తర్వాతి చిత్రానికి రెడీ అవుతున్నారు విజయ్.

ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేయనున్నారు. నిర్వాణ డైరెక్షన్లో వచ్చిన ‘మజిలీ’ విజయం సాధించగానే ఆయనతో విజయ్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ పూరి సినిమా కోసం వీరి ప్రాజెక్ట్ వాయిదా పడింది. దీంతో శివ నిర్వాణ సైతం నానితో ‘టక్ జగదీష్’ చిత్రాన్ని మొదలుపెట్టారు. వీరి ఇద్దరి సినిమాలు ఒకేసారి పూర్తికానున్నాయి. సో.. వచ్చే యేడాదిలో వీరి చిత్రం పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్టల మేరకు వీరి సినిమా ఆర్మీ నేపథ్యంలో ఉంటుందని, అందులో విజయ్ మేజర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ కూడ ఉంటుందట.

శివ నిర్వాణ సినిమా అంటేనే హుందాగా ఉండే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రెస్. అయన గత చిత్రాలు ‘మజిలీ, నిన్ను కోరి’లో హృదయానికి హత్తుకునే ప్రేమ కథలు ఉంటాయి. ఆ తరహాలోనే విజయ్ చిత్రం కోసం కూడ మంచి ప్రేమ కథను రాసుకున్నారట శివ నిర్వాణ. మరి ఆర్మీ నేపథ్యంలో సాగే ఆ ప్రేమ కథ ఎలా ఉంటుందో పూర్తిగా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు