మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష అలాగే ఆశికా రంగనాథ్ లు హీరోయిన్స్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే “విశ్వంభర”. చిరు నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న ఫాంటసీ సినిమా ఇది కాగా అనౌన్స్ చేసినపుడు మంచి హైప్ సెట్ అయ్యింది. కానీ నెమ్మదిగా సినిమా విడుదల ఎక్కడికో వెళ్ళిపోయింది. దీనితో అభిమానులు కూడా మరీ అంత ఉత్సాహం ఈ సినిమా విషయంలో చూపించడం లేదు.
ఇక లేటెస్ట్ గా ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ కొన్ని రోజుల్లోనే సినిమా తాలూకా కొత్త రిలీజ్ డేట్ కి సంబంధించిన క్లారిటీ రానుంది అని తెలుస్తుంది. అది ఈ నెలాఖరు లోపే కూడా కావచ్చట. ఇప్పటికే ఈ సినిమా ఎంతో ఆలస్యం అయ్యింది. ఇక మీద అయినా మేకర్స్ స్పీడ్ పెంచకపోతే కష్టమే అనుకోవాలి. ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
