‘వారణాసి’ తర్వాత మహేష్ నెక్స్ట్.. రూమర్స్ పై లేటెస్ట్ క్లారిటీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇపుడు టాలీవుడ్ నుంచి గ్లోబల్ మార్కెట్ కి తన వారణాసి సినిమాతో వెళ్లబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ ఏంటి అనే చర్చ ఎప్పుడు నుంచో ఉంది. ఆల్రెడీ తన పార్ట్ పూర్తి చేసేసుకున్న మహేష్ బాబు ఇప్పుడు రెస్ట్ మోడ్ లో ఉన్నారు.

అయితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు లైనప్ లో కోలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ వచ్చాడు అని పలు రూమర్స్ ఇప్పుడు ఒక్కసారిగా వైరల్ గా మారాయి. అయితే ఈ రూమర్స్ పై లేటెస్ట్ క్లారిటీ తెలుస్తోంది. మహేష్ నెక్స్ట్ వస్తున్న ఆ రూమర్స్ లో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదట.

కేవలం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, మహేష్ నడుమ ప్రాజెక్ట్ కోసం ఇద్దరూ పలుమార్లు చర్చలు అయితే జరిపారు కానీ ప్రస్తుతానికి సందీప్ కి ఉన్న కమిట్మెంట్స్ రీత్యా వీరి కాంబినేషన్ సెట్ అవ్వడానికి కూడా సమయం పడుతుంది అని తెలుస్తోంది. సో మహేష్ బాబు తదుపరి సినిమా విషయంలో ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదు అని చెప్పొచ్చు. ఏమైనా ఉంటే అధికారికంగానే బయటకి వస్తుంది. అప్పటి వరకు వారణాసి యుఫోరియాలో మునిగి తేలడమే.

Exit mobile version