లేటెస్ట్ క్లిక్స్ : మాజీ సీఎం కేసీఆర్ ని పరామర్శించిన మెగాస్టార్

లేటెస్ట్ క్లిక్స్ : మాజీ సీఎం కేసీఆర్ ని పరామర్శించిన మెగాస్టార్

Published on Dec 12, 2023 1:14 AM IST

ఇటీవల తన కాలుకి గాయం అవడంతో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కి హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మెల్లగా కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇకపోతే రెండు రోజులుగా పలువురు రాజకీయ ప్రముఖులు కేసీఆర్ గారిని హాస్పిటల్ లో పరామర్శించారు.

అయితే మ్యాటర్ ఏమిటంటే, కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి యశోద ఆసుపత్రికి వెళ్లి కేసీఆర్ ని పరామర్శించారు. కాగా కేసీఆర్ ఆరోగ్య ప్రస్తుత పరిస్థితి పై కేటీఆర్ మరియు ఇతర కుటుంబసభ్యులని అడిగి తెలుసుకున్న మెగాస్టార్, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. కాగా కేసీఆర్ ని మెగాస్టార్ పరామర్శించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు