లేటెస్ట్ క్లిక్స్ : ‘సలార్’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ప్రభాస్, ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్

లేటెస్ట్ క్లిక్స్ : ‘సలార్’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ప్రభాస్, ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్

Published on Jan 18, 2024 5:09 PM IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా తదితరులు నటించారు.

ఇక ఈ మూవీ సక్సెస్ ని తాజాగా బెంగళూరులో టీమ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసారు. ఈ సందర్భంగా హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూర్ దిగిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హోంబలె సంస్థ పై భారీ స్థాయిలో నిర్మితం అయిన ఈ మూవీ యొక్క సెకండ్ పార్ట్ సలార్ శౌర్యంగ పర్వం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు