పవర్ స్టార్ ‘ఓజి’ పై లేటెస్ట్ క్రేజీ బజ్

పవర్ స్టార్ ‘ఓజి’ పై లేటెస్ట్ క్రేజీ బజ్

Published on Jan 25, 2024 1:45 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, శ్రియా రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తోంది.

విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం ఈ మూవీలో తన అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కి తగ్గ ఎలివేషన్ సీన్స్ తో పాటు హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్స్ ని కూడా అద్భుతంగా రాసుకుని తెరకెక్కిస్తున్నారట దర్శకుడు సుజీత్. పవన్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని తప్పకుండా ఓజి మూవీ అలరిస్తుందని ఓజి యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు