లేటెస్ట్ : ‘పుష్ప – 2’ నుండి రేపు క్రేజీ అప్ డేట్

లేటెస్ట్ : ‘పుష్ప – 2’ నుండి రేపు క్రేజీ అప్ డేట్

Published on Apr 2, 2024 12:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఫహాద్ ఫాసిల్, అనసూయ, సునీల్, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు.

విషయం ఏమిటంటే, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న పుష్ప మూవీ నుండి రేపు ఒక క్రేజీ అప్ డేట్ రానున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం పుష్ప మాస్ జాతర పేరుతో ఒక పోస్టర్ రిలీజ్ చేసారు. కాగా ఇది పుష్ప 2 టీజర్ కి సంబంధించిందని తెలుస్తోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఆగష్టు 15న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు