లేటెస్ట్ : “ఫ్యామిలీ స్టార్” టీజర్ కి డేట్ & టైం వచ్చేశాయ్

లేటెస్ట్ : “ఫ్యామిలీ స్టార్” టీజర్ కి డేట్ & టైం వచ్చేశాయ్

Published on Mar 3, 2024 10:59 AM IST

టాలీవుడ్ రౌడీ హీరో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో చేస్తున్న రెండో చిత్రం “ఫ్యామిలీ స్టార్” కోసం అందరికీ తెలిసిందే. మరి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు నెలకొనగా రీసెంట్ గానే ఈ సినిమా టీజర్ పై హింట్ కూడా తాను ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ ఈ టీజర్ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేసారు.

దీని ప్రకారం ఈ టీజర్ ఈ మార్చ్ 4న సాయంత్రం ఆరున్నరకు విడుదల చేస్తున్నట్టుగా విజయ్ దేవరకొండ పై ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు. మొత్తానికి అయితే విజయ్ తో మంచి ఎంటర్టైన్మెంట్ నే మేకర్స్ ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. మరి చూడాలి ఈ చిత్రం ఎలా ఉంటుందో. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఏప్రిల్ 5న సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు