లేటెస్ట్: “పుష్ప 2” క్రేజీ డ్యూయెట్ అనౌన్స్మెంట్ డేట్ వచ్చేసింది

లేటెస్ట్: “పుష్ప 2” క్రేజీ డ్యూయెట్ అనౌన్స్మెంట్ డేట్ వచ్చేసింది

Published on May 22, 2024 11:17 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి ఆల్రెడీ మేకర్స్ సాలిడ్ అప్డేట్స్ ఒకొకటి అందిస్తుండగా ఇప్పుడు సినిమా రెండో సాంగ్ వరకు వచ్చేసారు. మరి నిన్ననే ఇవాళ రెండో సాంగ్ పై అప్డేట్ ఇస్తున్నట్టుగా హింట్ ఇవ్వగా ఇప్పుడు ఫైనల్ గా దీనిపై క్లారిటీ వచ్చేసింది.

దీనితో ఈ అవైటెడ్ సాంగ్ అనౌన్స్మెంట్ ని ఈ మే 23న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి వస్తున్నట్టుగా డేట్ ని సమయాన్ని లాక్ చేసేసారు. ఇక అలాగే ఈ సాంగ్ ఒక క్రేజీ డ్యూయెట్ అన్నట్టుగా కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు. రష్మిక, అల్లు అర్జున్ పై ఈ సాంగ్ వీడియోతో ఉంటుంది అని పోస్ట్ చేసారు. ఇక రేపు అప్డేట్ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కోసం కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగస్ట్ 15న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు