లేటెస్ట్ : హైదరాబాద్ లో ల్యాండ్ అయిన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్

లేటెస్ట్ : హైదరాబాద్ లో ల్యాండ్ అయిన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్

Published on Apr 20, 2024 3:00 AM IST

టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తో మాస్ యాక్షన్ మూవీ దేవర పార్ట్ 1 అలానే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ తో కలిసి స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 మూవీ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇటీవల తాజా షెడ్యూల్ లో భాగంగా ముంబై లో వార్ 2 కి సంబంధించి ఎన్టీఆర్, హృతిక్ ల పై పలు కీలక సీన్స్ తెరకెక్కించింది యూనిట్. కాగా ఆ షూట్ షెడ్యూల్ ముగించుకుని నేడు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్. ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర ఒకింత నెగటివ్ షేడ్స్ తో ఎంతో పవర్ఫుల్ గా ఉండనున్నట్లు టాక్. ఇక ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు