“కేజీయఫ్ చాప్టర్ 2” రిలీజ్ పై లేటెస్ట్ గాసిప్స్!

Published on Nov 28, 2020 10:01 am IST

ఇప్పుడు మన దక్షిణాది నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. రాకింగ్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రం ఇప్పటికే ఫైనల్ షూట్ లో ఉంది. ఇది కూడా తొందరగానే మేకర్స్ పూర్తి చేసేయనున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఎప్పటి నుంచో మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన విడుదల పట్ల లేటెస్ట్ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ టాక్ ప్రకారం ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ ను ఎప్పుడు విడుదల చేస్తారు అన్నది వచ్చే డిసెంబర్ చివరిలో అనౌన్స్ చేస్తారు అన్నట్టు వినికిడి. అప్పటికి షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యిపోతుంది. ఆ అనంతరమే డేట్ ఎప్పుడు అన్నది ఫిక్స్ చేసి మేకర్స్ ప్రకటిస్తారని ఇప్పుడు గాసిప్. మరి వేచి చూడాలి ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది.

సంబంధిత సమాచారం :

More