‘సలార్ 2’ లో మరో సర్ ప్రైజింగ్ రోల్ ?

‘సలార్ 2’ లో మరో సర్ ప్రైజింగ్ రోల్ ?

Published on Apr 29, 2024 9:42 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు సలార్-2 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే ‘సలార్ 2’ కోసం ప్రశాంత్ నీల్ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు. ఆల్ రెడీ ఇప్పటికే సలార్ 2 షూటింగ్ మొదలైంది. ఐతే, ఈ సినిమాలో ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇంతకీ, ఆ సర్ ఫ్రైజ్ ఏమిటో తెలుసా ?, ఈ సినిమాలో ఓ అతిధి పాత్ర ఉంది. ఈ పాత్రలో బాలీవుడ్ సూపర్‌ స్టార్ అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరి నిజంగానే అమితాబ్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తారా ?, చూడాలి. అన్నట్టు, ఈ పార్ట్ 2 సినిమాకు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. కాగా ఆ మధ్య ‘సలార్ 2’ సినిమా నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కూడా మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పార్ట్-2ని త్వరగా ఫినిష్ చేసి.. 2025లో రిలీజ్‌ చేస్తామన్నారు. కాగా, పార్ట్-2 సినిమా ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉండనుందని ఆయన తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు