“బిగ్ బాస్ 4” పై ఊహించని నయా టాపిక్.?

Published on May 27, 2020 1:39 am IST

మన ఇండియన్ టెలివిజన్ స్క్రీన్ హిస్టరీ లొనే హిస్టారికల్ టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేసిన రియాలిటీ గేమ్ షో ఏదన్నా ఉంది అంటే గత ఏడాది మన తెలుగులో ప్రసారం కాబడిన బిగ్ బాస్ సీజన్ 3. కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన ఈ షో భారీ స్థాయి టీఆర్పీ రేటింగ్ ను కొల్లగొట్టి హాట్ టాపిక్ అయ్యింది.

దీనితో ఆ తర్వాత సీజన్ పై కూడా మాంచి హైప్ వచ్చింది. ఈపాటికే కంటెస్టెంట్స్ ఎంపిక సహా చాలా పనులు పూర్తి చేసేసుకొనే ఈ షో ఇప్పుడు లాక్ డౌన్ వలన కొంత కాలం వాయిదా పడింది. అయితే ఈసారి కూడా నాగార్జునే నాలుగో సీజన్ కు హోస్ట్ చేస్తుండగా అందుకు సంబంధించి పనులు కూడా కొనసాగుతున్నాయి.

కానీ షోలో పాల్గొనేందుకు ఎంపిక చేస్తున్న కంటెస్టెంట్స్ విషయంలోనే కాస్త విషయం తారుమారు అయ్యినట్టుందని తెలుస్తుంది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ షోలో పాల్గొనేందుకు పలువురు నోటెడ్ సెలెబ్రెటీలే మొగ్గు చూపడం లేదట. దానికి కారణం కరోనా వలనే అని తెలుస్తుంది. మరి ఈ షోకు సంబంధించి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More