“ఆదిపురుష్” పై లేటెస్ట్ గాసిప్స్.!

Published on Sep 27, 2020 5:36 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణ ఆధారంగా తెరకెక్కించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రామునిగా కనిపించనుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రావణ పాత్రలో కనిపించనున్నారు. అయితే చిత్ర యూనిట్ నుంచి క్యాస్టింగ్ పరంగా ఇవి మాత్రమే అధికారికంగా బయటకొచ్చిన వార్తలు.

కానీ ఇపుడు ఈ చిత్రంలోని ఇతర క్యాస్టింగ్ కు సంబంధించి పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలు అయినటువంటి లక్ష్మణ, సీత మరియు హనుమ రోల్స్ కు సంబంధించి అప్డేట్ లను వచ్చే నెల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేసే ఛాన్స్ లేకపోలేదని టాక్. మరి ప్రభాస్ బర్త్ డే కు ఓంరౌత్ టీం కేవలం ఇదే ప్లాన్ చేసిందా లేదా మరేమన్నా సర్ఫరైజింగ్ ఎలిమెంట్స్ ను దాచి ఉంచిందా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :

More