ఒకప్పుడు ఇలియానా టాలీవుడ్ హాట్ ఫేవరేట్ హీరోయిన్. మొదటి చిత్రం దేవదాసు తో హిట్ అందుకున్న ఈమె, ఆ తరువాత మహేష్ పోకిరి సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఆ చిత్రం తరువాత కుర్రకారు కలల సుందరిగా మారిపోయింది. దానితో వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న తరుణంలో అమ్మడు బాలీవుడ్ వైపు అడుగులేసింది. 2012 రన్బీర్ కపూర్ హీరోగా వచ్చిన బర్ఫ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ విమర్శకుల ప్రసంశలు అందుకున్నప్పటికీ కాసులు పెద్దగా రాలలేదు. రెండవ చిత్రంగా షాహిద్ కపూర్ తో చేసిన పటా పోస్టర్ నికలా హీరో ప్లాప్ గా నిలిచింది.
ప్రస్తుతం అడపాదడపా చిత్రాలు చేస్తున్నప్పటికీ అక్కడ కెరీర్ చివరి దశకు చేరిందనే చెప్పాలి. అందమైన నడుముతో నాజూకుగా ఉండే ఇలియానా అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె కొంచెం లావెక్కడంతో పాటు, మునుపటి గ్లామర్ కోల్పోయింది. పబ్లిక్ ప్రదేశాలలో ఇలియానా ను చూసిన వారు ఇలియానాకు ఏమైందని వాపోతున్నారు. కొన్నాళ్ళు ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ప్రేమలో ఉన్న ఇలియానా ఈ మధ్య విడిపోవడం జరిగింది. అటు కెరీర్, ఇటు లైఫ్ రెండు ఇలియానాను డిస్టర్బ్ చేస్తున్నట్లు సమాచారం.
