“రామ్ చరణ్ – బుచ్చిబాబు మూవీ పై లేటెస్ట్ ఇన్ఫో!

“రామ్ చరణ్ – బుచ్చిబాబు మూవీ పై లేటెస్ట్ ఇన్ఫో!

Published on Apr 29, 2024 11:55 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను దాదాపుగా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యాకే, జూన్ లేదా జులై నెలలో RC16 స్టార్ట్ కానుంది.

బుచ్చిబాబు అన్ని పక్కా ప్రణాళిక తో సిద్ధం చేసుకొని ఉన్నారు. రామ్ చరణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పై మొదటి నుండి అందరిలో ఆసక్తి నెలకొంది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత బుచ్చిబాబు చేస్తున్న సినిమా కావడంతో సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని పై ఇండస్ట్రీ లో కూడా ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ అయినటువంటి సంగీత దర్శకుడు AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూడు అద్భుతమైన పాటలను కంపోజ్ చేసారని ఇదివరకే డైరెక్టర్ బుచ్చిబాబు వెల్లడించారు.

RC 16లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయిక గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ మరియు సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ పాన్ – ఇండియన్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ సమర్పిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు