“పుష్ప 2” షూటింగ్ పై లేటెస్ట్ ఇన్ఫో!

“పుష్ప 2” షూటింగ్ పై లేటెస్ట్ ఇన్ఫో!

Published on May 29, 2024 3:02 AM IST


పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule). ఈ చిత్రం ను ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ చాలా భాగం పూర్తి అయ్యింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే, ఈ చిత్రం కి సంబందించిన క్లైమాక్స్ ఇప్పుడు చిత్రీకరణలో ఉంది. ఈ చిత్రం కి కీలకమైన ఈ ఎపిసోడ్ ను చాలా పకడ్బందీ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మేకర్స్ ఎలాంటి లీక్స్ కానివ్వకుండా, జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే ఈ చిత్రం చివరిలో పార్ట్ 3 కి సంబందించిన చిన్న రివీలేషన్ ఉంటుంది అని టాక్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు