“RRR” మాసివ్ క్లైమాక్స్ ఎపిసోడ్ పై తాజా సమాచారం.!

Published on Jan 22, 2021 12:00 am IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. కొమరం భీం అలాగే అల్లూరి సీతా రామరాజుల పాత్రలపై భారీ బడ్జెట్ అండ్ నెవర్ బిఫోర్ విజువల్స్ తో జక్కన ఈ మహత్తర కావ్యాన్ని చెక్కుతున్నాడు.

మరి అలాగే ఇటీవలే మాసివ్ క్లైమాక్స్ ఎపిసోడ్ ను స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం కొన్ని రోజుల్లో పూర్తి కానుంది. మరి ఈ క్లైమాక్స్ సీన్ కు సంబంధించి ఇప్పుడు మరింత సమాచారం తెలుస్తుంది. తారక్ మరియు చరణ్ ల పై డిజైన్ చేసిన ఈ యాక్షన్ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందట. మరి అలాగే చాలా మేర ఈ ఎపిసోడ్ ను రాజమౌళినే డిజైన్ చేశారట.

మరి ఇందులో చరణ్ మరియు తారక్ ల మధ్య కలసి నడిచే సీన్స్ అన్నీ వెంట్రుకలు నిక్కబొడుచుకునే స్థాయిలో ఉంటాయట. వీటితో పాటుగా సాలిడ్ ఎమోషన్స్ సినిమా టైటిల్ కు జస్టిఫికేషన్ అంతా కూడా ఇందులోనే అంటే రౌద్రం రణం రుధిరం ఈ మూడు అంశాలు కరెక్ట్ గా సెట్టయ్యేలా అనిపించే విధంగా తీర్చిదిద్దుతారని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :