‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ పై లేటెస్ట్ ఇంట్రస్టింగ్ బజ్

‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ పై లేటెస్ట్ ఇంట్రస్టింగ్ బజ్

Published on Jan 18, 2024 3:02 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీని ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా శ్రీకాంత్, అంజలి, ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క రిలీజ్ కి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది.

దాని ప్రకారం గేమ్ ఛేంజర్ మూవీని అక్టోబర్ 2 న గాంధీ జయంతి లేదా అక్టోబర్ 12న దసరా సందర్భంగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మేకర్స్ మార్చి కల్లా ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. కాగా ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు శంకర్ అద్భుతంగా గ్రాండియర్ లెవెల్లో చిత్రీకరిస్తున్నట్లు చెప్తోంది యూనిట్. మరి పక్కాగా గేమ్ ఛేంజర్ రిలీజ్ పై క్లారిటీ రావాలి అంటే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు