లేటెస్ట్ : అనుష్క నెక్స్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

లేటెస్ట్ : అనుష్క నెక్స్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Published on Feb 14, 2024 11:07 PM IST

టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో ఒకరైన అనుష్క శెట్టి ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. యువ దర్శకుడు మహేష్ తెరకెక్కించిన ఈ మూవీలో నవీన్ పోలిశెట్టి హీరోగా కనిపించారు. అనంతరం అనుష్క నెక్స్ట్ మూవీ ఎప్పుడు మొదలవుతుందనే విషయమై ఆమె ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

కాగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క తన నెక్స్ట్ మూవీ చేయనున్నట్లు కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ టాలీవుడ్ అప్ డేట్ ప్రకారం, ఈ మూవీలో అనుష్క కి జోడీగా తమిళ నటుడు విక్రమ్ ప్రభు నటించనున్నారని, అలానే ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు అతి త్వరలో అఫీషియల్ గా మేకర్స్ నుండి అనౌన్స్ కానున్నాయట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు