ప్రభాస్ “కల్కి” పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

ప్రభాస్ “కల్కి” పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Nov 30, 2023 8:00 AM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి తెరకెక్కుతున్న పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లలో మొదటి పాన్ వరల్డ్ చిత్రంగా తెలుగు నుంచి వెళ్తున్న చిత్రం “కల్కి 2898ఎడి” ఒకటి. మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ లో అమితాబ్ బచ్చన్ ఆలాగే దీపికా పదుకోన్ సహా దిశా పటాని లాంటి స్టార్ నటులు నటిస్తున్నారు.

మరి ఈ సినిమా షూటింగ్ పార్ట్ చాలా మేరకు కంప్లీట్ కాగా ఆ భారీ తారాగణంతో పాటుగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు కమల్ ఈ సినిమా షూట్ లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో కల్కి షూటింగ్ జరుగుతుండగా మేకర్స్ ప్రభాస్ మరియు కమల్ లు ఇద్దరిపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇక సెట్స్ నుంచి కమల్ పిక్ కూడా ఒకటి బయటకి వచ్చింది. మరి ఈ భారీ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా ఏస్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు