లేటెస్ట్ : వైరల్ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి మ్యాసివ్ మేకోవర్ పిక్

లేటెస్ట్ : వైరల్ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి మ్యాసివ్ మేకోవర్ పిక్

Published on Dec 9, 2023 7:30 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ట తో తన కెరీర్ 156వ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మితం కానున్న ఈ మూవీకి విశ్వంభర అనే టైటిల్ పరిశీలనలో ఉండగా దీనిని భారీ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.

మ్యాటర్ ఏమిటంటే, తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ ని చేంజ్ చేసారు. అయితే ఆ పిక్ లో ఖాకీ కలర్ షర్ట్, ట్రెండీ హెయిర్ స్టైల్, బ్లాక్ కలర్ గ్లాసెస్ తో మెగాస్టార్ అదరగొట్టారు. ముఖ్యంగా ఈ పిక్ చూస్తుంటే గతంలో మెగాస్టార్ నటించిన పలు సినిమాల లుక్స్ గుర్తుకు వస్తాయి. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా విశ్వంభర మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా స్టైలిష్ మేకోవర్ పరంగా సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ పిక్ చూసిన పలువురు మెగాభిమానులు దీనిని సోషల్ మీడియాలో మరింతగా షేర్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు