లేటెస్ట్ : చరణ్ కు డాక్టరేట్ పై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

లేటెస్ట్ : చరణ్ కు డాక్టరేట్ పై మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

Published on Apr 14, 2024 12:07 AM IST


టాలీవుడ్ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని తాజాగా తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. కాగా అంతటి గొప్ప విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు చరణ్.

ఇక తన తనయుడికి డాక్టరేట్ దక్కడం పై మెగాస్టార్ చిరంజీవి తన ట్విటర్ ద్వారా స్పందించారు. తమిళనాడులోని ప్రసిద్ధ విద్యాసంస్థ వేల్స్ విశ్వవిద్యాలయం రామ్‌చరణ్‌కి గౌరవ డాక్టరేట్‌ను అందించడం నన్ను ఒక తండ్రిగా భావోద్వేగానికి గురిచేసింది మరియు అందుకు నేను గర్వంగా భావిస్తున్నాను.

ఇది ఒక ఉత్తేజకరమైన క్షణం. మన సంతానం వారి విజయాలతో మనల్ని అధిగమించినప్పుడే ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం. రామ్ చరణ్ రాబోయే రోజుల్లో మరింత ఎత్తుకి ఎదగాలి, లవ్ యు మై డియర్ డా.రామ్ చరణ్ అంటూ మెగాస్టార్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు