అక్కడ ‘ఆదర్శ కుటుంబం’ కోసం మైత్రి సంస్థ!

టాలీవుడ్ వెర్సటైల్ సీనియర్ స్టార్ నటుడు విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ కోసం అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఆడియెన్స్ లో మ్యాజిక్ చేస్తుంది అనుకుంటున్న ఈ సినిమా విడుదలకి కూడా కేవలం కొన్ని రోజుల సమయమే మిగిలి ఉంది.

అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఇప్పుడు ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలంగాణాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ ఎల్ పి వారు విడుదల చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. సో ఈ అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబం గ్రాండ్ గా విడుదల కానుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించాడు. అలానే హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version