లేటెస్ట్.. వాయిదా పడ్డ “ప్రతినిధి 2”

లేటెస్ట్.. వాయిదా పడ్డ “ప్రతినిధి 2”

Published on Apr 23, 2024 3:41 PM IST


టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ఫిల్మోగ్రఫీ మంచి ఆసక్తిగానే ఉంటుంది. ప్రస్తుతం తనకి సరైన హిట్ లేదు కానీ తన మొదటి సినిమా నుంచి కూడా విభిన్న కథాంశాలతో రోహిత్ ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. మరి అలాంటి చిత్రాల్లో పొలిటికల్ సూపర్ హిట్ చిత్రం “ప్రతినిధి” కూడా ఒకటి. మరి దానికి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ గా అది కూడా జర్నలిస్ట్ మూర్తి దర్శకునిగా మారి చేసిన సినిమానే “ప్రతినిధి 2”.

ఇది వరకే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకి ఈ ఏప్రిల్ 25న రిలీజ్ రావాల్సి ఉంది. కానీ లేటెస్ట్ గా మేకర్స్ ఈ డేట్ లో కూడా ఈ సినిమా ఆగినట్టు కన్ఫర్మ్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేసారు. మరి ఈ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో సిరి లెల్ల హీరోయిన్ గా నటించగా వానర ఎంటర్టైన్మెంట్స్ అలాగే రానా ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు