ఇక ఎవరికీ ఎలాంటి కంగారు అక్కర్లేదు !

ఇక ఎవరికీ ఎలాంటి కంగారు అక్కర్లేదు !

Published on Feb 6, 2019 7:01 PM IST

ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు పద్మశ్రీ, డా: బ్రహ్మానందం ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ‘లో ఆయన గుండె ఆపరేషన్‌ చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి సోషల్ మీడియాలో బ్రహ్మానందం ఆరోగ్యానికి సంబంధించి రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. దాంతో ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడుతున్నారు.

ఇక బ్రహ్మానందం ఆరోగ్యం విషయంలో ఎవరికీ ఎలాంటి కంగారు, భయం అక్కర్లేదు. ఆయన ఈ ఈ రోజు ఉద‌యం క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారు. పైగా ఆయ‌న త్వ‌ర‌లోనే షూటింగ్స్ కి కూడా వెళ్లనున్నారని తెలుస్తోంది. కాగా ప్రముఖ హృదయ చికిత్స నిపుణులు శ్రీ రమాకాంత్ పాండా బ్రహ్మానందంగారికి శస్త్ర చికిత్స చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు