ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తలలో ఉండే దర్శకుడు వర్మ, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే చిత్రంతో తెలుగు రాష్ట్రాలలో మరో మారు అగ్గి రాజేశారు. ఈ చిత్ర టీజర్ విడుదల అయినప్పటి నుండి ఈ చిత్రం ఇంకా వివాదాస్పదంగా మారింది. దీనితో వర్మపై చాలా మంది మండిపడుతున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్న ఆ సినిమాను ఆపివేయాలని కోరుకుంటున్నారు.
కాగా ఈ చిత్రం పై వస్తున్న వివాదాల గురించి స్పందించడానికి ఓ టీవీ డిబేట్ లో పాల్గొన్న వర్మ సీనియర్ గేయ రచయిత జొన్నవిత్తుల ను జొన్నవిత్తుల చౌదరి అని సంభోదిందడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. దీనికి ఆయన వర్మకు…, పప్పు వర్మ అనే కొత్త పేరును ఇవ్వడమే కాకుండా, వర్మ పైశాచికత్వం పై మూవీ తీస్తాను అంటూ సవాల్ విసిరారు. ఎప్పుడూ వేరొకరి వ్యక్తిగత జీవితాలను వారి అనుమతి లేకుండా తెరపై చూపించే వర్మ బయో పిక్ ని జొన్నవిత్తుల ఏ స్థాయిలో తీస్తారో చూడాలి మరి.


