మాఫియా డాన్ కథతో సుధీర్ వర్మ తియ్యబోతున్న సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శిని ఈ సినిమాలో కథానాయకిగా నటిస్తోంది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 6 నుండి వైజాగ్లో ప్రారంభంకానుంది. కొన్నిరోజులు అక్కడ షూటింగ్ పూర్తయ్యాక కాకినాడలో ఒక షెడ్యూల్ ఉంటుంది.
ప్రశాంత్ పిళ్ళై సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు దివాకర్ మణి సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీతో పాటు శర్వానంద్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ మొదటి షెడ్యూల్ కలకత్తా పరిసర ప్రాంతాల్లో జరిగింది.


