బన్నీ సినిమాలో దీపికా పడుకోణె ?

బన్నీ సినిమాలో దీపికా పడుకోణె ?

Published on Feb 6, 2024 12:27 AM IST

‘గుంటూరు కారం’ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోయే తన కొత్త ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు. పైగా ఇప్పటికే, ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఐతే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. మరి, దీపికా పడుకోణె, నిజంగానే బన్నీ సరసన నటిస్తే.. ఆ క్రేజే వేరు.

కాగా జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా పాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ కానుంది. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ చాలా కేర్ తీసుకుంటున్నాడు. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ – బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌ సంగీతం అదించబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు